చంద్రుని కోరిక మేరకు అక్కడే ఉండిపోయిన శివయ్య.. ఆయనను దర్శించుకుంటే..

శివుని అనంతమైన శక్తి రూపంగా జ్యోతిర్లింగాలను పరిగణిస్తూ ఉన్నాయి. దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలున్నాయి. వాటిలో మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో వెరావల ఓడరేవు సమీపంలో ఉన్న ఈ జ్యోతిర్లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి కారణమేంటంటే.. చంద్రుడే దీనిని స్వయంగా నిర్మించాడని నమ్మకం. చంద్రుడి పేరు మీదుగానే ఈ ఆలయానికి సోమనాథేశ్వర ఆలయమని పేరు వచ్చింది. అలాగే ఇక్కడి శివుడిని సోమ ప్రభువు అని.. సోమనాథేశ్వరుడని అంటారు.

దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను వివాహమాడిని చంద్రుడు ఒకరిపైనే విపరీతమైన ప్రేమ చూపించాడట. దీంతో మిగిలిన వారంతా తండ్రికి చంద్రుడిపై ఫిర్యాదు చేయగా.. ఆగ్రహించిన దక్ష ప్రజాపతి.. చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుందని శపించాడట. ఆ శాపంతో చంద్రుని ప్రకాశం పూర్తిగా తగ్గిపోయిందట. అప్పుడు చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో సౌరాష్ట్రకు వెళ్లి సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై చంద్రునికి అమరత్వాన్ని ప్రసాదించడంతో పాటు. 15 రోజుల పాటు క్షీణించి.. తిరిగి పౌర్ణమి నాటి నుంచి ప్రకాశించేలా వరమిచ్చాడట. దీంతో తను ప్రతిష్టించిన శివలింగంలోనే ఉండాలని శివుడిని చంద్రుడు కోరగా అక్కడే ఉండి పూజలు అందుకుంటున్నాడట. ఇక్కడి శివయ్యను పూజిస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం.

Share this post with your friends