శివుడు పులిరూపంతో అమ్మవారి ముందుకు వచ్చాడట.. తర్వాతేం జరిగిందంటే..

గోవాలోని శ్రీ మంగేశి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే శ్రీ మంగేశి ఆలయాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. ఆ తరువాతి కాలంలో పోర్చుగీసువారు ఆలయ నిర్మాణం గావించారని చెబుతారు. అయితే అక్కడి శివయ్యను మాత్రం స్థానికులు ప్రియల్‌కు తరలించి పూజించడం ప్రారంభించారట. అయితే శ్రీ మంగేశి ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా పార్వతీ అమ్మవారి చేతిలో పరమేశ్వరుడు ఓడిపోయాడట. అప్పుడు శివయ్య ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు.

పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్లాడో ఏమో తెలియక చింతించిన అమ్మవారు ఆయనను అన్వేషిస్తూ గోవాలోని జువారి నది వద్దకు వచ్చారు. ఆమెను చూసిన వెంటనే ఈశ్వరుడు పులి రూపం దాల్చి ఆమె ముందుకు వచ్చారట. ఆ హఠాత్పరిణామానికి నిశ్చేష్టురాలైన అమ్మవారు భయంతో అలాగే నిలిచిపోయారట. ఆ తరువాత తేరుకుని ‘త్రాహి మాం గిరీశ’ అంటూ ప్రార్థించారట. అంటే పర్వతాలకు ప్రభువైనా దేవా రక్షించు అని అర్థం. వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపం దాల్చడంతో పార్వతీమాత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట. మాం గిరీశీ అన్న పదమే కాలక్రమంలో మంగేశ్‌గా మారిందని చెబుతారు.

Share this post with your friends