వెదురు బొంగును ప్రాణం కావాలని అడిగిన శ్రీకృష్ణుడు.. అప్పుడేం జరిగిందంటే..

శ్రీకృష్ణుడు ప్రతి రోజూ ఉద్యానవనములోని ప్రతి మొక్క దగ్గరకు వెళ్లి అవి అంటే తనకు ఎంతో ప్రేమ అని వాటితో చెప్పేవాడట. అవి కూడా ‘కృష్ణా మేము కూడ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము!’ అని సమాధానం చెప్పేవి. ఒక రోజున శ్రీకృష్ణుడు చాల ఆత్రుతగా తొందరగా ఒక వెదురు బొంగు వద్దకు వెళ్ళాడు. ఆ వెదురు బొంగు ఎంతో కంగారుగా ‘కృష్ణా నావల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?’ అని అడిగింది. వెంటనే కృష్ణుడు ఆ వెదురు బొంగుతో ‘నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. కానీ దానిని నీవు ఇవ్వడం చాల కష్టంతో కూడుకున్న పని, అసాధ్యమైనది!’ అన్నాడు.

వెదురు బొంగును ప్రాణం కావాలని అడిగిన శ్రీకృష్ణుడు.. అప్పుడేం జరిగిందంటే..
వెదురు బొంగును ప్రాణం కావాలని అడిగిన శ్రీకృష్ణుడు.. అప్పుడేం జరిగిందంటే..

దానికి ఆ వెదురు బొంగు… ‘కృష్ణా పరవాలేదు అడుగు, నేను ఇవ్వగలిగి నదయితే తప్పకుండా ఇస్తాను!’ అని చెప్పింది. వెంటనే కృష్ణుడు… ‘నాకు నీ ప్రాణం కావాలి. నేను నిన్ను నరకాలి అనుకుంటున్నాను!’ అన్నాడు. వెంటనే ఆ వెదురు బొంగు… ‘కృష్ణా నన్ను నేను నీకు సమర్పించు కుంటున్నాను!’ అని పలికింది. కృష్ణుడు ఆ వెదురు బొంగును నరకి దానికి చిల్లులు పెడుతుంటే అది బాధను భరించలేక శ్రీకృష్ణుడి వంక చూసి… ‘నీవే శరణం!’ అన్నది. చివరకు అది వేణువుగా రూపాంతరం చెందింది. ఆ వేణువును నిరంతరం తన వెంట ఉంచుకుంటున్నాడు శ్రీ కృష్ణుడు.

Share this post with your friends