వినాయకుడే ఆ ప్రాంత వాసుల సంరక్షుడు..

ఇండోనేషియాలో హిందూ సంప్రదాయాలను బాగానే పాటిస్తారు. ఇక్కడ హిందూ దేవతలకు సంబంధించిన ఆలయాలు చాలానే ఉన్నాయి. గణేశుడి విగ్రహం అగ్ని పర్వతం అంచున ఉండటమనేది చాలా అరుదు. దాదాపు మరెక్కడా ఇలాంటిది లేదనే చెప్పాలి. ఈ విగ్రహాన్ని ఈ ప్రాంతవాసులంతా తమ సంరక్షుడిగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ విగ్రహానికి దైవిక శక్తి చాలా ఎక్కువని ఆ ప్రాంత వాసులు నమ్ముతారు. 700 ఏళ్ల క్రితం టెంగర్ తెగ ప్రజలు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ తెగ వారంతా గణేశుడిని తమ రక్షకుడిగా భావించి పూజలు చేసేవారట. అదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.

ఇక్కడ వినాయకుడికి పువ్వులు, పండ్లు, ధూపం సమర్పిస్తారు. ఒకవేళ అలా సమర్పించకపోతే అగ్నిపర్వతం కోపిస్తుందని అక్కడి వారి నమ్మకం. ఇండోనేషియాలో ఉన్న 141 అగ్నిపర్వతాల్లో 130 చురుకైన అగ్ని పర్వతాలు కాగా.. వాటిలో మౌంట్ బ్రోమో చాలా ప్రత్యేకమైనది. అసలు దీనికి మౌంట్ బ్రోమో అనే పేరు ఎలా వచ్చిందంటే.. హిందూ దేవుడు బ్రహ్మ పేరు నుంచి వచ్చిందని చెబుతారు. అంతేకాకుండా ఈ మౌంట్ బ్రోమో పర్వతం చూసేందుకు కూడా అద్భుతంగా ఉంటుంది. 2,392 మీటర్ల ఎత్తులో.. చుట్టూ ఉండే అద్భుతమైన అందాలు, ప్రకృతి దృశ్యాలతో కట్టిపడేస్తుంది.

Share this post with your friends