అన్న కోసం సరయు నదిలో జల సమాధైన లక్ష్మణుడు.. కారణమేంటంటే..

అన్న వెంటే నడిచిన లక్ష్మణుడి గురించి మనకు తెలుసు. ఎన్ని కష్టాలొచ్చినా అన్నను వీడలేదు. ఇక అన్న కోసమే.. అన్న రాజ్యానికి మాట రాకూడదనే కారణంతో లక్ష్మణుడు మరణించాడు. లక్ష్మణుడి ఈ కథ చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. పట్టాభిషేకానంతరం రాజ్యపాలనను శ్రీరాముడు ప్రారంభించాడు. ఒకరోజు రాముడిని కలిసేందుకు యముడు వచ్చాడు. తామిద్దరం మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఎవరూ రాకూడదని.. అలా వచ్చి ఆటంకం కలిగిస్తే వారికి మరణశిక్ష విధిస్తాననగా.. శ్రీరాముడు సరేనన్నాడు. లక్ష్మణుడిని ద్వారం దగ్గర కాపలా పెట్టి శ్రీరాముడు, యముడు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడకు దుర్వాస మహర్షి వచ్చాడు.

తన రాక గురించి శ్రీరాముడికి తెలియజేయమనగా లక్ష్మణుడు సున్నితంగా తిరస్కరించాడు. దీంతో దుర్వాసుడికి కోపం వచ్చింది. వెళ్లి తన రాక గురించి శ్రీరాముడికి చెబుతావా? లేదంటే అయోధ్య మొత్తాన్ని శపించమంటావా? అని అడిగాడు. చేసేదేమీ లేక లక్ష్మణుడు రూమ్‌లోకి వెళ్లాడు. దీంతో యముడికి కోపం వచ్చింది. రాముడు చాలా ఆందోళన చెందాడు. తన గురువైన వశిష్టుడిని మార్గం కోసం అర్థాంచాడు. తనకు ఇష్టమైన దానిని త్యాగం చేయడం మరణంతో సమానమని.. కాబట్టి లక్ష్మణుడిని త్యాగం చేయాలని చెబుతాడు. తన అన్న తనను దూరం పెట్టడం కంటే తనకు చావే మేలని లక్ష్మణుడు సరయు నదిలో జల సమాధి అవుతాడు.

Share this post with your friends