నేటి నుంచి కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

కొత్తకొండ వీరభద్రస్వామి గురించి తెలియని వారుండరు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని క్షేత్రంలో వీరభద్ర స్వామి కొలువయ్యాడు. ప్రతి ఏటా సంక్రాంతికి ఈ ఆలయంలో పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలతో పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది సైతం బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి సాయంత్రం 6:40 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 13వ తేదీ సోమవారం భోగిపండుగ, 14వ తేదీ మంగళవారం బండ్లు తిరుగుట (జాతర) వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 18వ తేదీన శనివారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారినపుడు మకర సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాం. దీనికి ముందురోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రాధాన ఆకర్షణ ఏంటంటే.. సంక్రాంతి రోజున ప్రజలు ఎద్దుల బండ్లలో వచ్చి మొక్కులు సమర్పిస్తారు.

Share this post with your friends