రాఖీని కట్టేటపుడు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోండి..

రాఖీ పండుగకు హిందూ మతంలో చాలా ప్రత్యేకత ఉంది. నాకు నువ్వు.. నీకు ఇది రక్ష అంటూ సోదరుడికి సోదరి రాఖీ కడుతూ ఉంటుంది. ఈ నెల 19 వ తేదీన రాఖీ పండుగ రానుంది. చాలా మంది సమయంతో సంబంధం లేకుండా రాఖీ కట్టేస్తూ ఉంటారు. రాఖీ కట్టే సమయంలో తప్పక ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. సమయం. ఈసారి మాత్రం రాఖీ కట్టాలంటే తప్పక సమయం చూసుకోవాల్సిందే. ఎందుకంటే భద్ర నీడ ప్రవేశించనుంది కాబట్టి. ఈ సమయంలో రాఖీ కట్టడం ఏమాత్రం మంచిది కాదు. భద్ర ఎవరు? భద్ర నీడ ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి విషయాలన్నీ ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు సోదరుడి చేతికి రాఖీ ఎప్పుడు కట్టాలో తెలుసుకుందాం.

ఇక భద్ర నీడ ఆగస్ట్ 18న రాత్రి ప్రవేశించి 19వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకూ ఉంటుంది. కాబట్టి రాఖీని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకూ కట్టవచ్చు. పంచాంగం ప్రకారమైతేఆ గస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:26 నుంచి సాయంత్రం 6:25 వరకూ రాఖీ కట్టవచ్చు. ఈ సారి రాఖీ పండుగ శ్రావణ మాసంలో వచ్చింది. దీంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ పండుగ రోజున మొదటి రాఖీని దేవుడికి సమర్పించి ఆ తరువాత సోదరుడికి కడితే మంచిదట. ముందుగా సోదరుడికి హారతి ఇచ్చి.. అనంతరం నుదుటన కుంకుమ పెట్టి.. అక్షింతలు వేసి ఆ తరువాత రాఖీ కట్టాలి. ఆ తరువాత సోదరుడి నోటిని తీపి చేయాలి.

Share this post with your friends