కనుమ రహదారిలో వైభవంగా అక్కగార్లకు కార్తీకమాస పూజలు

తిరుమల మొదటి కనుమ రహదారిలో అక్కగార్ల ఆలయం ఉందని తెలిసిందే. ఆ ఆలయంలో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు అక్కగార్లు కొలువై ఉన్నారు. తిరుమల కనుమ రహదారిలోని అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు. అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

నిత్యం ఈ తిరుమల దారిలో ప్రయాణించే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారె సమర్పించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ లా ఆఫీసర్ శ్రీ ఏ.వరప్రసాదరావు, డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, రవాణా విభాగం సిబ్బంది, ఇతరు అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends