కన్నయ్య పుట్టినరోజు వీరికి చాలా బాగుంటుందట..

విష్ణుమూర్తి 8వ అవతారంగా శ్రీకృష్ణుడిని పేర్కొంటారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు దేవకి గర్భాన శ్రీ కృష్ణుడు జన్మించాడు. కాబట్టి ఇవాళ జన్మాష్టమిని దేశమంతా వైభవంగా జరుపుకుంటోంది. అయితే కన్నయ్య పుట్టినరోజు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతోందట. ఆ రాశులు ఏంటో చూద్దాం.

వృషభ రాశి: కన్నయ్యకు ఇష్టమైన రాశుల్లో ఒకటిగా దీనిని చెబుతారు. ఇవాళ ఈ రాశి వారికి ఏదనుకుంటే అది జరుగుతుందట. ఆర్థిక పురోభివృద్ధి కూడా ఉంటుందట. ఎటువంటి సమస్య ఎదురైనా సునాయాసంగా దాటేస్తారట.

కర్కాటక రాశి: ఈ రాశి కూడా కన్నయ్యకు ఇష్టమేనట. కాబట్టి వీరికి కూడా ఇవాళ్టి నుంచి అద్భుతంగా ఉంటుందట. ఆర్థిక ప్రయోజనాలతో పాటు అవరోధాలన్నీ తొలగిపోయి సమస్యల నుంచి గట్టెక్కుతారట. అనారోగ్య సమస్యలన్నీ మాయమవుతాయట.

సింహరాశి: ఈ రాశివారిపై కూడా కన్నయ్య అనుగ్రహం ఉంటుందట. శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజ చేసి ఈ రాశి వారు ఏ పని చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుందట.

తులారాశి: తులారాశి వారికి కూడా ఇవాళ బాగా కలిసొస్తుందట. వాయిదా పడుతున్న పనులన్నీ పూర్తవుతాయట. అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులు కూడా సులభంగా చేస్తారు.

Share this post with your friends