నిత్యం కష్టపడుతూనే ఉన్నా కూడా కొందరి చేతిలో డబ్బు నిలవదు. ఎంత డబ్బు చేతికి వచ్చినా కూడా ఎటు పోయేది అటు పోతూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలు, బుుణ బాధలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అయితే చేతిలో డబ్బు నిలవాలంటే ఒక పని చేయాలి. అదేమీ లేదు. ఒక ఆలయాన్ని దర్శించుకుంటే చాలట. ఆ ఆలయమేంటో తెలుసుకుందాం. జాగేశ్వర్ కుబేర మందిరాన్ని దర్శిస్తే ఇక జీవితంలో ఆర్థిక ఇబ్బందులనేవే ఉండవట. అతి ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లైన భారతదేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది.
అతి ప్రాచీనమైన ఈ కుబేర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటుండదని చెబుతారు. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. దేవభూమి ఉత్తరాఖండ్‌లోని అల్మోరా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జాగేశ్వర్ ధామ్. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకునే వారంతా ఈ కుబేర ఆలయాన్ని దర్శించుకుంటారు. జాగేశ్వర్ ధామ్ కాంప్లెక్స్‌లో ఉన్న 125 ఆలయ సమూహాలలో కుబేరుని ఆలయం ఒకటి. ఈ ఆలయం ఈనాటిది కాదు.. దాదాపు 9వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. ఈ ఆలయం భారతదేశంలోని ఎనిమిదో కుబేర దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.