వినాయక చవితి పండుగను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి రోజున జరుపుకుంటారు. కాబట్టి ఈ నెల 7వ తేదీన పండుగను జరుపుకునేందుకు అంతా సిద్ధమవుతున్నాం. ఆ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేస్తారు. ఆ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 10 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం గణేషుడిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. విఘ్నాలకు అధిపతిగా నిర్వహించే పూజలో ముఖ్యంగా గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుందట. జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆనందం నెలకొంటుందట.
గణేష్ స్తోత్రం..
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.
ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః