
పూరీ జగన్నాథ స్వామి దేవాలయం నేడు హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇవాళ మధ్యాహ్నం రత్నభాండాగారంలోని మూడవ గది తెలుపులను అధికారులు తెరిచారు. 11 మందితో కూడిన సభ్యుల బృందం మూడో గదిలోకి వెళ్లి ఆ సంపదనంతా పెట్టెల్లో భద్రపరిచి బయటకు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన వెంటనే ముందుగా ఆ పెట్టెలను శుభ్రపరిచారు. ఆ తరువాత ఆభరణాల తరలింపును సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడ లెక్కింపును అధికారులు ప్రారంభించారు. అయితే చీకటి పడటంతో కొద్ది సేపటి క్రితం లెక్కింపును నిలిపివేశారు.
రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా అధికారులు డిజిటలైజేషన్ చేయనున్నారు. ఈ లెక్కింపు ప్రక్రియ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. రత్న భాండాగారం తెరిచిన సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారు. మరోవైపు రత్నభాండాగార సమీపంలో ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌నకు తరలించారు.
