తిరుపతిలో ఎస్ఎస్‌డీ టోకెన్ల కౌంటర్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి గౌతమి

తిరుమలలో ప్రతి ఒక్క విషయంలోనూ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం శ్రద్ధ తీసుకుంటోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లనూ చేస్తున్నారు. భక్తుల ఆహారం విషయంలోనూ.. మంచినీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. దళారులను కట్టడి చేసి భక్తులు మోసపోకుండా చూస్తోంది. అలాగే పదే పదే రూమ్స్ బుక్ చేసుకునే వివరాలను తీసుకుని వారిని కూడా కట్టడి చేస్తోంది. శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న టైం స్లాటేడ్ సర్వదర్శనం (ఎస్ఎస్ డి) టోకెన్ల కౌంటర్లను జేఈఓ (విద్యా, ఆరోగ్యం) బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీనివాసంలోని ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ కౌంటర్లు, క్యూ లైన్‌లను పరిశీలించారు. అనంతరం విష్ణు నివాసంలోని గదుల కేటాయింపు, ఎస్ఎస్‌డీ టోకెన్ల కౌంటర్లను, క్యూ లైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. జేఈఓ వెంట టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఈవోలు శ్రీమతి పార్వతి, శ్రీమతి భారతి తదితరులు ఉన్నారు.

Share this post with your friends