ఇప్పటికే మైసూర్ దసరా ఉత్సవాల గురించి తెలుసుకున్నాం. దసరా ఉత్సవాలు అక్కడ ఎంత వైభవంగా జరుగుతాయో కూడా తెలుసుకున్నాం. ఇక దసరా ఉత్సవాల్లో స్పెషల్ వచ్చేసి జంబోరైడ్. దసరా ఏనుగులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తారు. ఏనుగుల జంబో రైడ్‌ను చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి మైసూర్ నగరానికి వస్తుంటారు. కెప్టెన్ అభిమన్యు ఈ ఏడాది ఏనుగు అంబారీని నడిపిస్తారు. జంబూరైడ్‌లో భాగంగా ఏనుగులు, గుర్రాలు, ఒంటెలను అందంగా అలంకరిస్తారు.
రంగురంగుల పట్టికలు, నృత్య బృందాల ప్రదర్శన, సంగీత బృందాలు సైతం జంబూ రైడ్‌లో హైలైట్‌గా నిలుస్తాయి. జంబూ సవారీ అనంతరం పంజిన కవాతు జరుగుతుంది. దీనిని బన్నిమంటప కవాతు మైదానంలో సాయంత్రం నిర్వహిస్తారు. విజయదశమి రోజున మైసూర్ నగరంలోని వీధుల్లో జంబూ సవారీలు జరుగుతాయి. ఇవి మైసూర్ ప్యాలెస్ నుంచి ప్రారంభమవుతాయి. బన్నిమంటప వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ చాముండేశ్వరి దేవి విగ్రహాన్ని బంగారు అంబారీలో ఏనుగుపై ఉంచి ఊరేగిస్తారు.