సీతమ్మ వారికి పురుడు ఇక్కడే జరిగిందట..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి 12 కి.మీ దూరంలో నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం అనే గ్రామ పంచాయతీలో బోదికొండపై రామాలయం ఉంటుంది. బోదికొండ అనేది ఏకశిల అని తెలుసుకున్నాం కదా. ఈ కొండపై తమ అరణ్యవాస సమయంలో పాండవులు నివసించారని ప్రతీతి. ఇక్కడ పూజలందుకునే దేవతామూర్తులను పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడే ఇచ్చాడని ప్రతీతి. ఇప్పటికీ ఈ దేవతామూర్తులే పూజలు అందుకుంటున్నారు. ఇక బోదికొండపై ఒక కొలను కూడా ఉంది. ఎలాంటి సమయంలోనూ ఈ కొలనులో నీరు ఎండిపోదట.

బోదికొండపై భీముడి గృహం కూడా ఉంది. ఈ పర్వతం ఒకానొక సమయంలో పడిపోతుండగా భీముడు దీనిని తన తలతో ఆపిసట్టుగా చెబుతారు. ఏకశిలపై ఆలయంతో పాటు కొలను వంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీని నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటాయని చెబుతారు. ఇక సీతమ్మవారు ఇక్కడ నివసించారట. ఈ కొండపై సీతమ్మవారు లవకుశలను ఆడించిందట. అలాగే కొండ కింద సీతమ్మకు పురుడు జరిగిందని చబెుతారు. ఇక్కడి రాళ్ల నుంచి ఇంగువ వాసన వస్తుందట. ఒకే ప్రదేశంలో ఇన్ని ఉన్నాయి కాబట్టే ఈ ప్రదేశమంతా చాలా ఇరుకుగా ఉంటుందని చెబుతారు.

Share this post with your friends