
ప్రాచీన కాలంలో శ్రీ విల్లిపుత్తూరు వరాహ క్షేత్రం అని పిలవబడింది. శ్రీ మహావిష్ణువు వరాహావతారం దాల్చి అమ్మవారితో ఇక్కడ విశ్రాంతి తీసుకొనినందున ఈ పేరు వచ్చింది. ‘చంపకారణ్యం’ అనే అడవిలో ఈ వరాహ క్షేత్రంలో ఒక భాగంగా వుండేది. ఒకానొకప్పుడు ఆ అడవిలో విల్లి, గండన్ అనే ఇద్దరు అన్నదమ్ములు కోయరాజులుగా వుండేవారు. ఒకసారి వారివురు వేటకు వెళ్ళినప్పుడు చిన్నవాడైన గండన్ ఒక పులిని తరుముకుంటూ వెళ్ళాడు. ఎదురు తిరిగిన పులి అతనిని చంపి వేసింది.
తమ్ముని వెతుకుతూ తెలియని విల్లి తన తమ్ముని వెతుకుతూ అతను కనపడకపోయేసరికి అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రమించి గాఢనిద్ర పోయాడు. విల్లికి స్వప్నంలో అనంత శయనుడు దర్శనమిచ్చి గండన్ని పులి చంపిన వైనం తెలిపాడు. ఆ తరువాత భగవానుడు “తాను కాలనేమి అనే అసురుని వధించడానికి వచ్చి సమీపాన గల మర్రి చెట్టు కింద ఉన్న పొదల్లో ‘వటపత్రశాయి గా ‘విమలాకృతి’ విమానంలో, శయన భంగిమలో వెలసి ఉన్నట్లు చెప్పి
ఈ అడవిని ఒక సుందర నగరంగా తీర్చి తనకు ఆలయం నిర్మించమని విల్లికి సకల శుభాలు చేకూరుతాయని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
