శుక్రాచార్యుడికి ఇక్కడే శివుడు దృష్టిని ప్రసాదించాడట..

తమిళనాడు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న వెల్లిశ్వరర్ ఆలయం గురించి ఇప్పటికే చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా.ఇక్కడకు వెళ్లిన వారికి దృష్టి సంబంధిత సమస్యలు తొలగిపోతాయని కూడా తెలుసుకున్నాం. అసలు ఈ ఆలయానికి దృష్టి సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి సంబంధం ఏంటి? అంటే ఈ ఆలయ కథేంటో తెలుసుకోవాల్సిందే. విష్ణుమూర్తి వామనావతారం ఎత్తిన సమయంలో అసురుల గురువు శుక్రాచార్యుడు తన దృష్టిని కోల్పోయాడట. అప్పుడు బాధతో కుంగిపోయిన శుక్రాచార్యుడు.. పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడట.

ఆ తపస్సు మైలాపూర్‌లో ఉన్న వెల్లిశ్వరర్ ఆలయ ప్రాంతంలోనే చేసి తన దృష్టిని తిరిగి పొందాడట. అతని భక్తికి సంతోషించిన శివుడు దృష్టిని తిరిగి ప్రసాదించాడట. కాబట్టి ఇక్కడి శివుడిని వెల్లిశ్వరర్ అని పిలుస్తారు. వెల్లి అంటే శుక్రుడు, ఈశ్వరుడు అంటే శివుడు అని అర్ధం. శుక్రాచార్యుడు అంతటి వాడికి దృష్టిని ప్రసాదించిన ప్రాంతం కాబట్టి ఈ ఆలయానికి వచ్చిన వారికి సైతం శివుడు కంటి సమస్యలను తొలగిస్తాడని నమ్మకం. అలాగే శుక్ర గ్రహానికి సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నవారికి సైతం ఇక్కడికి వస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

Share this post with your friends