పాండవులకు శ్రీకృష్ణుడు ఆ తీర్థంలో స్నానమాచరించమని చెప్పాడట..

పరమ పవిత్రమైన తిరుమల గిరులలో ఎన్నో పుణ్యతీర్థాలున్నాయని తెలుసుకున్నాం కదా. తిరుమల పరిసర ప్రాంతాల్లో కుమారధార తీర్థం, సనక సనందన తీర్థం, తుంబుర తీర్థం, జాబాలీ తీర్థం, పాపనాశన తీర్థం, పాండవ తీర్థం వంటివి ఉన్నాయని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఉన్న వాటిలో అత్యంత విశేషమైనది పాండవ తీర్థం. తిరుమల శ్రీనివాసుని ఆలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవ తీర్థం ఉంటుంది. ఈ తీర్థానికి మరో పేరు కూడా ఉంది. అదే గోగర్భ తీర్థం. పాండవ తీర్థం స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం.

పాండవ తీర్థం స్థల పురాణం ఏంటంటే.. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు, ఈ తీర్థంలో కొంతకాలం పాటు స్నానమాచరించమని శ్రీకృష్ణుడు చెప్పాడట. అలా చేస్తే మీకు విజయం తథ్యమని శ్రీకృష్ణుడు తెలిపాడట. శ్రీకృష్ణుడి సూచన మేరకు ఏడాది కాలం పాటు పాండవులు ఈ తీర్థం సమీపంలోనే నివాసముండి పాండవ తీర్థంలో స్నానం చేస్తూ వచ్చారట. ఆ తరువాత పాండవులు యుద్ధంలో పాల్గొని విజయం సాధించారట. ఆ తరువాత యుద్ధంలో పాండవులు విజయం సైతం సాధించారట. పాండవుల ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చిన తీర్థం కావడం వల్ల దీనికి పాండవ తీర్తమనే పేరు వచ్చిందనేది స్థల పురాణం.

Share this post with your friends