అరుణాచలంలో దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తారట..

గిరి ప్రదక్షిణ చెప్పుల్లేకుండా, నెమ్మదిగా చేయాలి. తలపై టోపీలాంటివి ధరించొద్దు. కేవలం ఎడమవైపునే గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారంటారు. కావునే వారికి సాధారణ భక్తులు ఎదురు వెళ్లకూడదు. గిరి ప్రదక్షిణ ఆరంభించాక ఎలాంటి కోరికలు కోరకూడదు. ‘అరుణాచలశివ’ నామస్మరణతో సాగాలి. అప్పుడప్పుడు గిరి వైపు చూస్తుండాలి. ప్రతీ ఆలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోవాలి. ప్రదక్షిణ మార్గంలో కుక్కలకు తిండి తప్పక పెట్టాలి (భైరవ స్వరూపం కనుక).

సంతానం కోసం, వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్న చెట్టుకు తాడు కడతారు. అరుణాచలం… పంచలింగ క్షేత్రాల్లో అగ్ని భూతానికి ప్రతీక. ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది. రమణ మహర్షి తపస్సు ద్వారా అనుగ్రహం పొందిన ప్రదేశం ఆలయంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది. సర్వసిద్ధి వినాయకునికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ లింగేశ్వరుని సన్నిధి ఉంది. ఆ పక్కనే వేయి కాళ్ల మండపం, అన్నదాన సత్రం, శివగంగ తీర్థం అనే కోనేరు ఉన్నాయి.

Share this post with your friends