జేష్ట అమావాస్య నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట..

హిందూ మతంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జేష్ట అమావాస్యకు మరింత ప్రాధాన్యను ఇస్తారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చట. ముఖ్యంగా అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. ప్రస్తుతం జేష్ఠ మాసం కొనసాగుతోంది. ఈ నెల 25న అమావాస్య తిథి రానుంది. దీంతో జేష్ట మాసం ముగుస్తుంది. మరి ఆ రోజున ఏం చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం.

జేష్ట అమావాస్య తిథినాడు ఇంటి ఈశాన్యం మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించి.. దానిలో 7 లవంగాలను ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

ఈ రోజున తులసి జపమాలతో మంత్రాలను జపించినా.. అలాగే తులసి పూసలతో గాయత్రీ మంత్రాన్ని జపించినా మంచి ఫలితం లభిస్తుందట.

కుంకుమ పువ్వు, లవంగాలను కర్పూరంతో కలిపి వెలిగిస్తే.. ఇంట్లో సానుకూల శక్తితో పాటు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.

జేష్ట అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదీస్నానమాచరించాలి. నదీస్నానం సాధ్యంకాకుంటే నీటిలో గంగాజలం కలిపినా సరిపోతుంది. ఆ తరువాత అభిజిత్ ముహూర్తంలో దక్షిణ ముఖంగా పూర్వీకులకు అర్ఘ్యం సమర్పిస్తే పితృదోషం నుంచి విముక్లి లభిస్తుంది.

రావి చెట్టు పూర్వీకులకు అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు కాబట్టి జ్యేష్ఠ అమావాస్య రోజున రావి చెట్టును పూజించాలి. ఆ తరువాత రావిచెట్టు మొదట్లో పాలు, పంచదారతో తయారు చేసిన స్వీట్‌ను నైవేద్యంగా సమర్పించాలి.

Share this post with your friends