2024కు మరో మూడు రోజుల్లో ముగింపు పలకనున్నాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. నూతన సంవత్సరంలో జాతక దోషం నుంచి బయటపడి అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఓ పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. 31న అర్ధరాత్రి 12 గంటలకు విధివిధానాలు పాటించడం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. నూతన సంవత్సరంలో లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
31న ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నూతన సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభించి కష్టాల నుంచి గట్టెక్కుతామట. పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దానిపై బియ్యంపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. దాని మధ్యలో మల్లి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. అలాగే ఒకటింపావు కేజీ కందులను ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. 31వ తేదీన అర్ధరాత్రి పూజగదిలో దీపం వెలగించాలట. పూజగదిలో లక్ష్మీదేవి పటాన్ని పెట్టి అలంకరించి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం.