ఈ ఆలయ మరమ్మతును నిర్వహిస్తే ఆకస్మిక మరణం తప్పదట..

మనం ఏ దేవత అయినా కూడా విరిగిన విగ్రహాలకు పూజలు నిర్వహించం. కానీ ఇక్కడ మాత్రం విరిగిన విగ్రహాలకే పూజలు జరుగుతాయి. పైగా ఈ విగ్రహాలకు పైకప్పు కూడా విరిగిపోయి ఉండదు. ఎవరైనా మరమ్మతు చేయడానికి ప్రయత్నించారో వారికి ఆకస్మిక మరణం తప్పదట. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో దిబియాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సెహుద్ గ్రామంలో ఉన్న నాగ మందిరంలో ఒక విరిగిన పైకప్పు కింద విరిగిన విగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా విరిగిన విగ్రహాలను ఇక్కడి వారంతా నాగపంచమి నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

విరిగిన పైకప్పు ఏంటి? విరిగిన విగ్రహాలకు పూజలు నిర్వహించడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఆ కథేంటో తెలుసుకుందాం. ఆలయం విరిగిన పైకప్పు మరమ్మతులు ఎవరూ నిర్వహించలేదని కాదు.. ఇప్పటికే ఆ ప్రయత్నం జరిగింది. కానీ అలా ప్రయత్నించిన వారి ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మరణిస్తారట. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్‌ ఈ ఆలయంపై కూడా దండయాత్ర చేశాడట. ఆ సమయంలోనే విగ్రహాలను ధ్వంసమయ్యాయని చెబుతారు. నాగ పంచమి రోజున భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటికీ విరిగిన ఆలయ పైకప్పును నేటికీ మరమ్మతులు చేయలేదు.

Share this post with your friends