
ఏపీలోని కర్నూలులో యాగంటి ఉమా మహేశ్వర ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ పురాతన ఆలయంలోని నందీశ్వరుడు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాడని కూడా తెలుసుకున్నాం. దీనికి కారణమేంటి? 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు దీనిని నిర్మించారు. ప్రతి ఆలయంలోనూ శివలింగానికి ఎదురుగా తప్పనిసరిగా నందీశ్వరుడు ఉంటాడు. అయితే యాగంటి ఆలయంలోని నందీశ్వరుడు అయితే శివుడి కంటే కూడా పెద్దగా ఉంటాడు. ఈ నంది విగ్రహం గురించి భక్తులు అనేక నమ్మకాలున్నాయి. ఈ నంది విగ్రహం మరి ఎప్పుడు పెరుగుతుంది?
ఈ నంది విగ్రహం పరిమాణం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని చెబుతారు. ఇలా పెరుగుతుండటంతో ఆలయంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వస్తోందట. ఆసక్తికర కథనం ఏంటంటే.. ఈ ఆలయంలోని నంది విగ్రహం పెరుగుదలకు.. కలియుగం అంతానికి సంబంధం ఉందని చెబుతారు. కలియుగం అంతమయ్యే సమయంలో ఈ ఆలయంలోని నందికి ప్రాణం వచ్చి రంకె వేస్తుందట. అలా రంకె వేసిందంటే కలియుగం అంతమవుతుందని చెబుతారు. ఇదొక్కటి మాత్రమే కాదు.. ఆ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలోని నందీశ్వరుడి గురించి చాలా కథలు ఉన్నాయి.
