సతీదేవి ఇక్కడే ఆత్మాహుతి చేసుకుందట..

ద్రాక్షారామం క్షేత్రం గురించి తెలుసుకున్నాం. ద్రాక్షారామానికి గోదావరి ఎలా వచ్చిందో కూడా తెలుసుకున్నాం. ఈ క్షేత్రం స్థల పురాణం దక్షయజ్ఞంతో ముడిపడి ఉంది. సతీదేవి తండ్రి దక్షప్రజాపతి దక్ష యజ్ఞం ఈ ప్రదేశంలోనే నిర్వహించాడని తెలుసుకున్నాం కదా. దీనికి అల్లుడైన శివుడిని తప్ప దేవతలందరినీ ఆహ్వానించాడట. సతీదేవికి తన తండ్రి యాగాన్ని చూడాలన్న కోరిక కలగడంతో శివుడిని అడిగిందట. కానీ శివుడు పిలవని పేరంటానికి వద్దని వారించాడట. అయినా సరే.. ఒంటరిగా వెళతానంటూ అక్కడకు వెళ్లిందట. కానీ అక్కడ ఆమెకు అవమానం ఎదురవడంతో సతీదేవికి దక్షవాటికలో దూకేస్తుంది.

సతీ వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి, దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేస్తాడు. ఆ తరువాత సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని శివుడు విలయ తాండవం చేశాడట. దానిని ఆపేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలు చేశాడట. అవి ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు వెలిశాయట. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకొన్న చోట పరమేశ్వరుడు భీమ రూపంలో స్వయంభువుడిగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. అయితే ఇక్కడ శివలింగాన్ని సూర్యభగవానుడు తొలుత అర్చించాడని పురాణాలు చెబుతున్నాయి.

Share this post with your friends