కొన్ని తర్కాలు మనకు అంతుబట్టవు. అలాంటిదే ఇది. ధనం గొప్పదా? ధర్మం గొప్పదా? అంటే.. ఇది కలియుగం ఆకలియుగం..ఇక్కడ రూపాయిదే రాజ్యం పుట్టిన దగ్గర నుంచి చావు దాకా బంధాలు నిలబడాలన్న మనిషి బతకాలి అన్న ప్రతి నిమిషం రూపాయలు లేనిదే ఏది జరగదు. ఆ నలుగురు చిత్రంలో చెప్పినట్టు రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే ? పిల్లలు తల్లితండ్రుల్ని విడదీస్తాను..ప్రేమికులను విడదీస్తాను పెళ్లిళ్లని చెడగొడతాను..బంధాలు నిలబడాలన్నా,పలుచబడాలన్న విడిపోవాలన్నా నేనే చేస్తాను..నిన్ను కొట్టాలని వచ్చిన వాడిని కూడా సలాం కొట్టేలా చేస్తాను..అబద్ధాలు ఆడిస్తాను,మాటలు మారుస్తాను..
అక్రమ సంబంధాలకు తెరతీస్తాను..కూర్చున్న చోట నుంచి శాసిస్తాను..శత్రువుల్ని పెంచుతాను. వ్యసనాలకు బానిస చేస్తాను అంతులేని సంతోషాలు ఇస్తాను..కొత్త కొత్త బంధాలను నీ చుట్టూ తిప్పిస్తాను…ప్రేమని పలచన చేస్తాను..కళ్ళు నెత్తికెక్కి అయిన వాళ్ళని కష్టపడేలా మాటలనేలా చేస్తాను..రూలర్ గా చేయాలన్న రోడ్డు మీదకి లాగాలన్నా నేనే చేస్తాను. ఈ ప్రపంచాన్ని శాసించాలన్నా ప్రాణం నిలబెట్టాలన్న నేనే చేస్తాను అంటుంది. ఎంతన్న డబ్బు డబ్బే..ఎందుకంటే ధనం మూలం ఇధం జగత్…అయితే,ధర్మం లేని ధనం అర్థరహితం అని గుర్తుంచుకోవాలి..ధర్మం లేని వ్యక్తి సంపదను సృష్టించినా,సంపాదించినా,ఆనందంగా అనుభవించ లేరు.అందుకే ధనం, ధర్మం రెండింటినీ సమతుల్యంగా పరిగణించడం చాలా ముఖ్యం.