
ఉపాసన అనే పదాన్ని వింటూనే ఉంటాం. పేరు కూడా పెడుతూనే ఉంటారు. అసలు ఉపాసన అంటే ఏంటి? దానిని మనసుతో చేస్తారా? శరీరంతో చేస్తారా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుంది. ఉపాసన మనసుతో చేసేది . ఉప ..అంటే సమీపములో …ఆసన-అంటే కూర్చోవడం . పూర్తిగా చూస్తే పరమాత్మ సమీపములో మనసును ఉంచటమే ఉపాసన. కళ్లు మూసుకొని ఒక చేతితో జపమాలను తీసుకుని మనసులో మరొక చింతనతో చేసేది జపం ఏమాత్రం కాదని పండితులు చెబుతారు.
మనసును పూర్తిగా పరమాత్మయందే ఉంచాలి. పరమాత్మ పాదాలు మొదలుకొని.. అది పూర్తిగా మనసులో నిలుపుకున్నాక.. ప్రతి అవయవాన్నీ మనసులో నిలుపుకోవాలి. ఏ పని చేసినా పరమాత్మ పాదాలు లేదా బాహువులు లేదా ముఖ మండలము కనపడాలి. ఈ విధంగా సాధన చేస్తే ఏ లోకంలో ఉన్నా పరమాత్మ సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మన శరీరానికి కావాలసిన పనులను అప్రయత్నముగానే చేస్తాము. ఏడుస్తూ, నవ్వుతూ , కోపిస్తూ, కలహిస్తూ కూడా తింటాం. అలవాటైన పనికి మనసుతో పనిలేదు. కావున ఉపాసనను అలవాటు చేసుకుంటే అంతటా స్వామియే కనపడతాడు. విధంగా స్వామి దగ్గర మనసును ఉంచడమే ఉపాసన.
