తిరుమలలో ఉద్యోగులు ‘ఓం నమో వేంకటేశాయ’ అని చెప్పాకే మాట్లాడాలట..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతిరోజు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారాంతాల్లో అయితే రోజుకు దాదాపు 80 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారి క్షణకాల దర్శనం కోసం భక్తులు ఎన్ని గంటలైనా క్యూలైన్లలో వేచి ఉంటారు. స్వామివారిని చూడగానే తమ చిరకాల కోరిక నెరేవరిందన్నంతగా ఆనంద పరవశులవుతారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేసే ఉద్యోగులకు తాజాగా తిరుమల తిరుపతి పాలక మండలి కొన్ని ఆంక్షలను విధించింది.

ముఖ్యంగా భక్తులకు సేవలందించే వలంటీర్లు సహా టీటీడీ ఉద్యోగులు భాష, వేషధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని టీటీడీ సూచిస్తోంది. ఇకపై ఏ ఉద్యోగి అయినా కూడా భక్తులతో మాట్లాడటానికి ముందు గోవింద అని కానీ ఓం నమో వేంకటేశాయ అని కానీ చెప్పిన తర్వాత మాత్రమే వారికి ఏం కావాలో చూడాలని టీటీడీ సూచించింది. ఇక టీటీడీ ఉద్యోగులు శనివారాల్లో తప్పక తెల్ల ప్యాంట్ లేదంటే పంచె.. తెల్ల చొక్కా ధరించాలి. అలాగే నుదుడిపై కుంకుమ, విభూతి ధరించి మాత్రమే విధులకు హాజరు కావాలని సూచిచింది. మహిళా ఉద్యోగులైతే శనివారాల్లో తెల్లటి చుడీదార్.. దానిపై దుపట్టా తప్పని సరి లేదంటే చీరకట్టులో విధులకు హాజరు కావాలి. నుదుటిపై కుంకుమ లేదంటే తికం తప్పనిసరిగా పెట్టుకోవాలని టీటీడీ సూచించింది.

Share this post with your friends