
స్వాతంత్ర్యం రాక ముందు ఆదివారం మాంసాహారాలను ముట్టేవారు కాదు. ఆ తరువాత బ్రిటీషర్లు మన సంస్కృతీ సంప్రదాయాలను దెబ్బ తీసేందుకు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారని కూడా తెలుసుకున్నాం కదా. ఆ తరువాత నుంచి ఆదివారం సెలవు దినం కాబట్టి హిందువులంతా మాంసం, మద్యాలతో విందు భోజనం ఆరగించేవారు. కానీ ఒక్క గ్రామంలో మాత్రం ఆదివారం మందు, మాంసాహారాలను అస్సలు ముట్టరు. ఆ గ్రామమేంటి? దాని కథేంటో తెలుసుకుందాం. కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్ర నుంచి పాణ్యం నుండి 20 కి.మీ. దూరంలో కొత్తూరు గ్రామం ఉంటుంది.
ఈ గ్రామంలో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎన్నో విశేషాలకు సమాహారం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు కొలువుదీరారు. ఇక్కడ సర్ప రూపంలో మనకు సుబ్రహ్మణ్యస్వామి దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం ఈనాటిది కాదు. 500 ఏళ్ల క్రితం సుబ్రహ్మణ్య స్వామి సుబ్బరాయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుంచి ఊరి పేరు కూడా సుబ్రహ్మణ్యస్వామి పేరు మీదుగానే సుబ్బరాయుడు కొత్తూరుగా పిలవబడుతోంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధ్య దైవంగా భావించే ఈ గ్రామస్తులు ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం, మాంసం ముట్టరు.
