ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తే పితృదేవతగా కొలువయ్యాడట..

శ్రీరాముడు తమ పూర్వీకులకు శ్రాద్ద కర్మలు చేసిన ఆలయం ఒకటుందని తెలుసా? శ్రీరాముడే కాదు.. పాండవులు సైతం తమ పూర్వీకులకు ఇక్కడే శ్రాద్ద కర్మలు చేశారట. మరి ఆ ఆలయం ఎక్కడుంది? ఇప్పటికీ ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తున్నారా? తెలుసుకుందాం. ఈ క్షేత్రం బీహార్‌లోని గయలో ఉంది. వాస్తవానికి హిందువులు ‘గయ’ని ‘మోక్షభూమి’గా పిలుస్తారు. ఇక్కడకు వచ్చిన వారంతా తమ పూర్వీకులకు పిండదానం చేస్తారు. ఇక్కడ తర్పణం, పిండ ప్రదానం చేయడం ద్వారా, పూర్వీకులకు మోక్షం లభిస్తుంది.

గయలో పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని పురాణాలు, గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. అంతేకాకుండా ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారు పితృ రుణం నుంచి విముక్తి పొందుతారట. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ పితృదేవతగా కొలువయ్యాడని చెబుతారు. అంతేకాకుండా పిండదానాన్ని అందించే వారిని స్వామివారు ఆశీర్వదిస్తూ ఉంటాడట. గయలో పిండదాన ప్రాముఖ్యతను పురాణాలు, గరుడ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం వంటి గ్రంథాలు వివరిస్తున్నాయి.

Share this post with your friends