బిల్వ పత్రాల ప్రాధాన్యమేంటి? అవి పరమశివుడికి ప్రీతికరంగా ఎలా మారాయి?

దేవుళ్లలో ఒక్కొక్కరికి ఒక్కోరోజంటే ఇష్టం. హనుమంతుడికి మంగళవారం, అయ్యప్ప స్వామికి బుధవారం, వేంకటేశ్వర స్వామికి శనివారం.. ఇలా చెప్పుకుంటూ అందరూ దేవుళ్లకూ ఒక్కో వారం ప్రీతికరం. ఇక శివుడికి సోమవారం అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున శివుడిని పూజిస్తే మనకు చాలా మంచి జరుగుతుందట. శివుడిని మెప్పించడం చాలా సులువు, అందుకే ఆయనను భోళా శంకరుడు అంటారు. నీటితో అభిషేకించినా చాలు మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. శివుడికి అభిషేకాలన్నా చాలా ఇష్టమట. అందుకే ఆయనను అభిషేక ప్రియుడని కూడా అంటారు.

ఇక మహాదేవుడికి బిల్వ పత్రాలు అంటే ఎంతో ప్రీతీ. అసలు ఆ పత్రాలకు ఎందుకంత ప్రాధాన్యం? ఆ బిల్వ పత్రాలకు అంతటి ప్రాముఖ్యత ఉంది. బిల్వపత్రాలతో పాటు.. నీటితో అభిషేకిస్తే.. శివుడి సంతోషిస్తాడన శాస్త్రాల్లో ఉంది. అయితే బిల్వపత్రాలకు గల ప్రాముఖ్యత ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదిస్తుండగా హాలాహలం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిని పరమశివుడు కంఠంలో దాచుకుని గరళకంఠుడు అయ్యాడు. అయితే విషం కారణంగా ఆయన నల్లగా మారుతుంటే బిల్వ పత్రాలతో పూజించి విష ప్రభావాన్ని తగ్గించారట. అప్పటి నుంచి బిల్వపత్రాలు పరమ శివుడికి ప్రీతికరంగా మారాయి.

Share this post with your friends