నిత్యం వీరిని పూజిస్తే సమస్యలనేవే ఉండవు..

వాస్తు దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయని ముందుగానే చెప్పుకున్నాం. ఆరోగ్య, ఆర్థిక తదితర సమస్యలన్నీ మనల్ని ఇబ్బంది పెడతాయి. అయితే తూర్పు దిక్కుకు సూర్య భగవానుడు అధిపతి కాబట్టి తూర్పు దిక్కులో వాస్తు దోషం ఉన్నవాళ్లు ప్రతిరోజూ ఆయనకు పూజలు నిర్వహిస్తే సరిపోతుంది. పశ్చిమ దిశకు అధిపతి శనీశ్వరుడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలిసి ఉంటుంది. ముఖ్యంగా శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ప్రతి శనివారం శని చాలీసా పఠించి.. హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించండి. ఇక ఉత్తర దిశలో దోషముంటే ఆర్థిక సమస్యలొస్తాయి. వాటి నుంచి బయటపడాలంటే బుధ యంత్రాన్ని స్థాపించి గణేషుడిని పూజించాలి.

దక్షిణ దిశకు అంగారక గ్రహం అధిదేవత. కాబట్టి ఈ దిశలో దోషముంటే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర విభేదాలు తలెత్తుతాయి. దక్షిణ దిక్కు దోషాలు తొలగిపోవాలంటే హనుమంతుడిని నిత్యం పూజించాలి. ఈశాన్య దిశకు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనికి శివుడు అధిదేవత. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఆదిదంపతులైన శివపార్వతులను పూజించాలి. ఆగ్నేయ దిక్కుకు శుక్రుడు అధిదేవత. ఈ దిశలో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిని పూజించాలి. నైరుతి దిక్కులో దోషముంటే రాహు, కేతువులను.. వాయువ్య దిక్కులో దోషముంటే చంద్రుని మంత్రాన్ని జపించాలి. అలాగే శివుడని పూజించాలి.

Share this post with your friends