
ప్రతి ఒక్కరూ జీవితంలో అదృష్టం, ఐశ్వర్యం కోసమే తపిస్తూ ఉంటారు. ఇవి ఉంటే తప్ప జీవితంలో సక్సెస్ అనేది రాదు. మరి దీనికోసం ఏం చేయాలో మనం పుట్టిన మాసంలో కొన్ని పరిహారాలు చేయాలట. అవేంటో తెలుసుకుందాం. చైత్ర మాసంలో జన్మిస్తే ప్రతిరోజు లేదా ఆదివారం పరమశివున్ని జిల్లేడు పూలతో పూజించడంతో పాటు గులాబీ రంగు దుస్తులను ధరించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో జన్మించిన వారు ఇష్ట దైవాన్ని రోజూ పూజించచడంతో భగవంతునికి పాటు తీపి పదార్థాలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. జ్యేష్ఠ మాసంలో జన్మించిన వారు లక్ష్మీ నారాయణులను పూజిస్తే అదృష్టం కలిసి వస్తుందట.
ఆషాఢ మాసంలో పుట్టిన వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేస్తే మంచి జరుగుతుందట. శ్రావణ మాసంలో జన్మించిన వారు వీలైనప్పుడు అలసందలతో గారెలు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలట. భాద్రపద మాసంలో జన్మించినవారు దత్తాత్రేయుడిని పూజించాలి. ఆశ్వయుజ మాసంలో జన్మించిన వారు కొండపైన ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించాలట. కార్తీక మాసంలో జన్మించిన వారిరు ఇంటి సింహ ద్వారానికి జిల్లేడు వేరును కడితే మంచి జరుగుతుందట. మార్గశిర మాసంలో జన్మించిన వారికి తొందరగా ధనయోగం కలగాలంటే.. దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలట. పుష్య మాసంలో పుట్టిన వారు శివాభిషేకం చేయాలట. మాఘమాసంలో జన్మించిన వారు పుట్ట పూజ ఎక్కువగా చేయాలట. ఫాల్గుణ మాసంలో జన్మించిన వారు గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు పుట్టిన మాసం ఏదో దాని ప్రకారం ఫాలో అవ్వండి.
