ఉత్తరప్రదేశ్ సంభాల్‌లో మొహల్లా హల్లు సారాయ్‌లో కొలువైన చాముండా దేవి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. చాముండా దేవి చౌహాన్ రాజవంశం కుల దేవత అని నమ్ముతారు. ఇది ఒక సిద్ధ పీఠం కావడం విశేషం. ఒక దివ్యజ్యోతి నిరంతరాయంగా ఈ ఆలయంలో వెలుగుతూనే ఉంటుంది. అలాగే ప్రతి నవరాత్రికి హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం నుంచి దివ్యకాంతిని ఈ ఆలయానికి తీసుకువస్తారు.
అయితే ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ఒక నిబందన విధించారు. పొట్టి లేదా అసభ్యకరమైన దుస్తులు ధరించి భక్తులు ఆలయానికి రావొద్దని రూల్ పెట్టారు. దీనికి సంబంధించి ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రదేశాలలో పోస్టర్లను సైతం అతికించడం జరిగింది. భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఆలయానికి రావాలని స్పష్టంగా పోస్టర్ల ద్వారా వెల్లడించారు. పొట్టి దుస్తులు ధరించిన వారిని లోపలికి అనుమతించబోమని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.