శని దోషం పోగొట్టుకోవాలంటే ఇక్కడకు వెళ్లాల్సిందే…

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం కొన్ని రాశుల వారికి ఏలిన నాటి శని, కొందరికి అర్ధాష్టమ శని, మరికొందరికి అష్టమ శని వంటి దోషాలు నడుస్తున్నాయి. ఎవరైతే ఆ శని దోషాలతో ఇబ్బందులు పడుతుంటారో వారు జీవితంలో ఒక్కసారైనా ఈ శనీశ్వరాలయ ఆలయాలను దర్శిస్తే చాలట. ఉపశమనం కలుగుతుందని చెబుతారు. మరి ఆ దేవాలయాలేంటో తెలుసుకుందాం. శనీశ్వరుడిని న్యాయానికి అధి దేవుడికి చూస్తారు. ఎవరి జాతకంలో అయితే శని స్థానం బలంగా, శని దృష్టి అనుకూలంగా ఉంటుందో వారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవట. శని దేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం కష్టాలకు కొదువ ఉండదట. అన్ని విధాలుగా నష్టాలే సంభవిస్తాయట.

శని దేవుని ప్రస్తావన వస్తే ముందుగా మనకు గుర్తొచ్చేది మహారాష్ట్రలో అహ్మద్‌నగర్ జిల్లాలోని శని శింగనాపూర్. ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శని దేవుని అనుగ్రహం కోసం వస్తారు. ఈ శనీశ్వరుడిని దర్శించుకుంటే ఎలా శని దోషమైనా పోతుందని నమ్మకం. ఈ ఊళ్లో ఇంటికే కాదు.. కనీసం బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు. దీనికి కారణం.. శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం. నిజంగానే ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగ లేదు. శని దోషం ఉన్నవారు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.

Share this post with your friends