లక్ష్మీదేవి మన ఇంట ఉండాలంటే ఈ పని అస్సలు చేయకండి

దేవతల్లో లక్ష్మీదేవికి విశిష్ట స్థానం ఉంది. సర్వసంపదలకు అధినేత్రిగా లక్ష్మీదేవిని మనం కొలుచుకుంటాం. ఆమె కరుణ మనపై లేకుంటే ఎన్ని ఉన్నా ఇబ్బందులు తప్పవు. మనం సంతోషంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా జీవించాలంటే అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాల్సిందే. మన ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సూర్యాస్తమయం తరువాత కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఉప్పును సాయంత్రం ఆరు దాటితే పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదట. అలాగే నువ్వులను సైతం సాయంత్రం వేళ కొనకూడదట. అలా చేస్తే శనిదోషం చుట్టుకుంటుందట. ఇనుప వస్తువులను సైతం సాయంకాలం వేళ కొనుగోలు చేయకూడదట. అలాగే ఆముదాన్ని కానీ ఆముదపు గింజలను కానీ సాయంత్రం వేళ కొనకూడదట. తోలు వస్తువులు, అలాగే దుస్తులు కుట్టేందుకు వినియోగించే సూది, మహిళలు వినియోగించే పిన్నీసులు వంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనుగోలు చేయకూడదట. వీటిలో దేనిని కొనుగోలు చేసినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందట.

Share this post with your friends