మనదేశంలో ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత అయితే తప్పక ఉంటుంది. ఆలయాలను దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. కొన్ని ఆలయాల్లో మట్టి, నీటితో సహా ప్రతిదీ మనకు ఏదో ఒక మంచిని చేస్తుంది. అలాంటి ఆలయమే కర్ణాటకలో ఉంది. ఇక్కడి ఆలయంలోని మట్టిని ఒంటికి రాసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా ఇట్టే పోతుందట. ఈ మట్టిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని నమ్మకం. ఇది మంచి మెడిసిన్‌లా పని చేస్తుందట. అందుకే ఈ మట్టిని చర్మ వ్యాధులున్నవారు ఒంటికి రాసుకుంటే అవన్నీ పోతాయట.
కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని కల్లు వీరన హళ్లిలోని మఠితలేశ్వర దేవాలయంలోని మట్టి సైతం మనకు మంచి చేస్తుందట. ఇక్కడ శివయ్య కొలువై ఉన్నాడు. ఆది, గురువారాలైతే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయం మద్ది చెట్టు కింద ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి మఠితలేశ్వరాలయం అని.. ఇక్కడి శివయ్యను మత్తితలేశ్వర్ అని పిలుస్తారు. ఈ శివయ్య చుట్టూ ఉన్న మట్టిలోనే ఔషధ గుణాలు చాలా ఉన్నాయట. చర్మ వ్యాధులతో బాధపడేవారికి ఇక్కడి పూజారి పుట్ట నుంచి తీసిన మట్టిని చెట్టు బెరడుతో కలిపి ఇస్తాడు. దానిని రాసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా పోతుందట.