ఇది చదివితే ప్రపంచంలో పాపాలు తగ్గిపోతాయట..

గరుడ పురాణంలో ఏముందో తెలుసుకున్నాం కదా. అసలు గరుడ పురాణం ఏం చెబుతోందో కూడా తెలుసుకున్నాం. మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చేసిన పాప ఫలితాల శిక్షలను గరుడ పురాణంలో వివరించారు. మరణానంతరం ఏం జరుగుతుందనేది గరుత్మంతునికి విష్ణుమూర్తి చెప్పాడట. ఒకసారి గరుత్మంతుడు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడని విష్ణుమూర్తిని అడిగాడట. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఏయే శిక్షలు పడతాయని సైతం అడిగాడు.

గరుత్మంతుడి సందేహాలన్నింటికీ విష్ణుమూర్తి సమాధానాలు చెబుతాడు. ఆ సమాధానాలే గరుడ పురాణం. మానవుడు తెలిసీతెలియక చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు విధిస్తారు? అవి ఎంత భయంకరంగా ఉంటాయనేది వివరించడం జరిగింది. ఆ శిక్షల గురించి తెలిస్తే ఎవరూ పాపాలు చేయరు. రామాయణ, మహాభారత, భాగవత పురాణాలు చదివి ఎంతో ప్రేరణ పొందుతారు. అలాగే గరుడ పురాణాన్ని సైతం చదవాలట. తద్వారా మరణానంతరం మనం చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలుంటాయో తెలుస్తాయి. ఇది చదివితే ప్రపంచంలో పాపాలు తగ్గిపోతాయట.

Share this post with your friends