తిరుమల శ్రీవారి 10 రోజుల హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే..

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు పూర్తయ్యాయి. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల10 నుంచి ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం రాత్రి ఏకాంత సేవతో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి.ఈ పది రోజుల్లో శ్రీ మలయప్పస్వామివారికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం 10 రోజుల్లో 6 లక్షల 83వేల304మంది తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా.. హుండీ ఆదాయం రూ.34.43 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే 10 రోజుల్లో లక్షా 83వేల 132మంది భక్తుల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ శ్రీ మలయప్ప స్వామివారి టోకెన్ లేని భక్తుల దర్శనాలకు 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం కేవలం రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న శ్రీవారిని 83,806 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 23,352 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 3.59 కోట్లుగా నమోదు కావడం విశేషం.

Share this post with your friends