
హనుమంతుడిని పూజించని హిందువంటూ ఉండడు. శ్రీరాముడి భక్తుడైన ఆంజనేయుడు ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఉంటాడట. ఎంతటి కష్టాన్నైనా తొలగించే సంకటమోచనుడిగా ఆంజనేయుడిని భక్తులు కొలుస్తారు. ఇక ఊరిలో ఏ ఆలయం ఉన్నా లేకున్నా హనుమంతుడి ఆలయం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వీటిలో కొన్ని హనుమంతుడి ఆలయాలు వెరీ స్పెషల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హనుమంతుడు ఆర్థోపెడిక్ వైద్యుడట. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా కూడా నిజమని అక్కడి వారంతా చెబుతారు.
అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది. హనుమంతుడు ఆర్థోపెడిక్ వైద్యుడిలా ఎలా మారారో తెలుసుకందాం. మధ్యప్రదేశ్ కట్ని జిల్లా నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ముహాసాలో హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో ఇక్కడ ఇసుకేస్తే రాలనంతగా భక్తులు వస్తారు. ఈ ఆలయంలో ఒక మూలికను ఇస్తారట. ఆ మూలికను స్వీకరించి నమిలితే చాలట. విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయట. ఎందరో బోన్ ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ ఇక్కడికి వచ్చి మూలికలను నమిలి జాయింట్ సమస్యలను తగ్గించుకున్నారట.
