స్వస్తిక్‌ను శుభానికి చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. దీనికి మతపరమైన ప్రాధాన్యత ఉంది. స్వస్తిక్‌ను గణేశుడి రూపంగానూ.. శ్రేయస్సు, సమృద్ధి, ఏకాగ్రత, ముఖ్యంగా విశ్వానికి చిహ్నంగా భావిస్తారు. స్వస్తిక్ మధ్య భాగాన్ని విష్ణుమూర్తి నాభి గానూ.. నాలుగు రేఖలను బ్రహ్మ నాలుగు ముఖాలుగానూ.. నాలుగు చేతులు, నాలుగు వేదాలుగానూ పరిగణిస్తారు. స్వస్తిక్ నాలుగు బిందువులు నలు దిక్కులకు సంకేతాలని చెబుతారు. ఎంతో ప్రాధాన్యాత కలిగిన స్వస్తిక్‌ను సకల పూజలలో వినియోగిస్తారు. ముఖ్యంగా చందనం, కుంకుమ, సింధూరంతో చేసిన స్వస్తిక్ గ్రహ దోషాలను తొలగిస్తుందని పండితులు చెబుతారు.
సు, అస్తి అనే పదాల కలయికే స్వస్తిక్. సు అంటే శుభం, అస్తి అంటే ఉండటం మొత్తంగా శుభంగా ఉండాలి.. సంక్షేమం కలగాలని అర్ధం. స్వస్తిక్‌ను గీసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటున కూడా తలక్రిందులుగా స్వస్తిక్ తయారు చేయకుండా జాగ్రత్తగా దాని గీతలు, కోణాలు ఖచ్చితంగా సరైనవిగా ఉండేలా చూసుకోవాలి. ఎరుపు పసుపు రంగు స్వస్తిక్‌లు ఉత్తమమైనవి. మీరు స్వస్తిక్ ధరించాలనుకుంటే దానిని వృత్తం లోపల ధరించండి. ఎరుపు నీలం రంగు స్వస్తిక్ అత్యంత ప్రభావవంతమైనదట. అలాగే ఎరుపు రంగు స్వస్తిక్‌ను ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉంచితే గ్రహ దోషాలు తొలగిపోతాయట. నీలంరంగు స్వస్తిక్‌ను ప్రధాన ద్వారం పైన మధ్య భాగంలో ఉంచితే ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవట.