ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయో ఇబ్బందులు తప్పవట..

ఇంట్లోని కొన్ని వస్తువులు ప్రతికూలతను పెంచుతాయి. వాటి ప్రభావం ఇంట్లోని వ్యక్తులపై పెద్ద ఎత్తున ఉంటుంది. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకోకుండటమే ఉత్తమం. మరి ఇంట్లో ఏమేం వస్తువులు ఉంచుకోకూడదో చూద్దాం. ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో పెంచుతుందట. అలాగే పగిలిన గాజు కప్పులను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా ఉంచుకుంటే మన గురించి గాసిప్స్‌ను పెంచి గొడవలకు దారి తీస్తుందట. పైగా పగిలిన గాజును ఇంట్లో పెట్టుకోవడం పేదరికాన్ని సూచించడంతో పాటు దురుదృష్టం వెంటాడుతుందట.

అలాగే వాడిపోయిన పువ్వులను ఇంట్లో పెట్టుకోకూడదట. ఇది మరణంతో పాటు విచారానికి చిహ్నమట. దీంతో ఇంట్లో నెగిటివిటీని పెంచుతుందట. కాబట్టి ఎండిన పువ్వులతో పాటు పాత క్యాలెండర్లు ఉన్నా వాటిని ఇంట్లో నుంచి తీసివేయాలట. పాత క్యాలెండర్లు గతానికి సంకేతాలు. కాబట్టి ముందుకు వెళ్లలేమట. ఇక ముళ్ల మొక్కలను సైతం ఇంట్లో పెంచుకోకూడదట. ప్రస్తుతం కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచితే నెగిటివిటీ పెరుగుతుందట కాబట్టి వీటిని పెంచుకోవాలనుకుంటే ఇంటి వెలుపలే పెంచుకోవాలి. అలాగే ఇంట్లో ఖాళీ కుర్చీ ఆత్మలను ఆహ్వానిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంట్లోని కుర్చీలో నిత్యం ఎవరో ఒకరు కూర్చొనేలా చూసుకోవాలట.

Share this post with your friends