
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తులు కొలుచుకనే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతంలోని వివిధ భాగాలను పురాణాలు ఏ విధంగా అభివర్ణిస్తున్నాయో తెలుసుకుందాం. శేష పర్వతంలోని ముఖభాగాన్ని వేంకటాద్రి అని, మధ్యభాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి అనేక పుణ్య తీర్థాలతో శేషగిరులు జలసంపదకు నిలయంగా ఉన్నాయి. వాటిలో జ్ఞానప్రద తీర్థములుగా పిలవబడేవి 108.
జ్ఞానప్రద తీర్థములు:
ఈ తీర్థ జలములను సేవిస్తే జ్ఞాన యోగం ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
1. మను తీర్థము 2. ఇంద్ర 3. వసు 4. రద్ర(11) 5. ఆదిత్య (12) 27. ప్రజాపతి (9) 36. అశ్విని 37. శుక్ర 38. వరుణ్ 39. జాహ్నవి 40. కాపేయ 41. కాణ్వ 42. ఆగ్నేయ 43. నారద 44. సోమ 45. భార్గవ 46. ధర్మ 47. యజ్ఞ 48. పశు 49. గణేశ్వర 50. భౌమాశ్వ 51. పారిభద్ర 52. జగజాడ్యహర 53. విశ్వకల్లోల 54. యమ 55. బ్బారస్పత్య 56. కామహర్ష 57. అజామోద 58. జనేశ్వర 59. ఇష్టసిద్ధి 60. కర్మసిద్ధి 61. వట 62. జేదుంబర 63. కార్తికేయ 64. కుబ్జ 65. ప్రాచేతస (10) 75. గరుడ 76. శేష 77. వాసుకి 78. విష్ణువర్థన 79. కర్మకాండ 80. పుణ్యవృద్ధి 81. ఋణవిమోచన 82. పార్జన్య 83. మేఘ 84. సాంకర్షణ 85. వాసుదేవ 86. నారాయణ 87. దేవ 88. యక్ష 89. కాల 90. గోముఖ 91. ప్రాద్యుమ్న 92. అనిరుద్ధ 93. పిత్రు 94. ఆర్షేయ 95. వైశ్వదేవ 96. స్వధా 97. స్వాహా 98. అస్థి 99. ఆంజనేయ 100. శుద్ధోదక 101. అష్ట భైరవ (8) – మొత్తం 108 తీర్థములు.
