గరుడ పురాణం మనిషి మరణానంతరం ఏం జరుగుతుందనే విషయాలే కాకుండా కొన్ని అలవాట్ల గురించి కూడా చెబుతుంది. కొన్ని అలవాట్లుంటే తప్పనిసరిగా మార్చుకోవాలి లేదంటే ఇల్లు నాశనమవుతుంది. పైగా ఈ అలవాట్లు ఇంట్లో కలహాలతో పాటు పేదరికాన్ని తెస్తాయి. హిందూ మతంలో గరుడ పురాణం ముఖ్యమైన గ్రంథం. ఇది 18 మహాపురాణాలలో ఒకటైన ఈ గరుడ పురాణాన్ని మహర్షి వేదవ్యాసుడు దీన్ని రచించాడు. మరణానికి సంబంధించిన విషయాలతో పాటు ఎన్నో విషయాలు దీనిలో ఉంటాయి. విష్ణువు జీవితానికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. వీటిని పాటిస్తే సమస్యల నుంచి బయటపడి సంతోషంగా జీవించవచ్చు.
గరుడ పురాణం మతపరమైన నియమాలు, నిబంధనల గురించి సైతం ప్రస్తావిస్తుంది. కొంతమందికి ఇంట్లో అనవసరమైన చెత్తను వదిలేయకుండా నిల్వ చేసే అలవాటు ఉంటుంది. దీని వల్ల కుటుంబంలో కలహాలు పెరగడంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గి సంబంధాలు తగాదాలతో నిండిపోతాయి. ఇంటి లోపల వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అన్నపూర్ణ దేవి అక్కడ నివసిస్తుంది. కానీ చాలా మంది వంటగదిని శుభ్రంగా ఉంచరు. రాత్రిపూట ఖాళీ పాత్రలను సింక్‌లో వదిలేయడం వలన కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కాబట్టి రాత్రిపూట పాత్రలు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుందట.