ఇలా చేశారో ఇంట్లోని వారికి చిక్కులు తప్పవట..

మనం ఉండే ఇంట్లో అది అద్దె ఇల్లైనా.. సొంతిల్లైనా తప్పక వాస్తు నియమాలను పాటిస్తాం. సొంతిల్లు అయితే ఇంటి నిర్మాణం చేపట్టడానికి ముందు నుంచే పక్కా వాస్తు నిపుణులకు చూపించి ఏ గది ఎక్కడ రావాలో తెలుసుకుని దానిని పక్కాగా ఫాలో అవుతాం. ఇంట్లో వాస్తు దోషాలుంటే చికాకులు, గొడవలు తప్పవట. దీని వలన ఇంట్లో రకరకాల చికాకులు ఏర్పడుతాయట. ఇక అంత పక్కాగా ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత కొన్ని కొన్ని పనులతో ఇబ్బందుల్లో పడుతుంటాం. అవేంటో తెలుసుకుందాం.

ఇంటి గోడలకు మేకులు కొడితే ఎక్కడ అవి పాడవుతాయో అని మెయిన్ డోర్ లేదంటే బెడ్ రూమ్ డోర్‌కి హ్యాంగర్స్ ఏర్పాటు చేసుకుంటారు. ఇది మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన మన పురోగతి కుంటు పడుతుందట. ఇంటి ప్రధాన ద్వారం వచ్చేసి లక్ష్మీదేవి స్థానమట. మరి అలాంటి డోర్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయడం అస్సలు మంచిది కాదట. అలాగే డోర్ మీద టవల్స్ ఆరేయడం కూడా సరికాదట. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా ఇంట్లోని వారిని ఇబ్బంది పెడతాయట.

Share this post with your friends