శ్రావణమాసంలో ఇలా చేస్తే శని దోషం నుంచి విముక్తి ఖాయమట..

నిన్నటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. పూజలకు వేళైనట్టే. ఈ నెల మొత్తం నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమ, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పూజలు చేస్తే సత్ఫలితాలు లభిస్తాయట. మంగళవారం నాడు మంగళ గౌరి వ్రతం.. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి.

శ్రావణ మాసంలో చేసే పూజలు కారణంగా గ్రహ దోషాలు కూడా తొలగుతాయని నమ్మకం. శ్రావణ సోమవారం నాడు శివుడికి పంచామృతతంలో పూజించాలి. ఇలా చేస్తే మనం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతామని నమ్మకం. శ్రావణ మంగళవారం నాడు పూజలు నిర్వహించినా కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామట. ఇక శ్రావణ శుక్రవారం నాడు పూజలు నిర్వహిస్తే విశేష ఫలితం లభిస్తుందట. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు గోవుకు చపాతీలు తినిపించడం వలన ఫలితాలు మరింత విశేషంగా ఉంటాయి. అలాగే ఈ మాసంలో ఎప్పుడు వీలైతే అప్పుడు గోమాతకు బెల్లం తినిపిస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుందట.

Share this post with your friends