ప్రతిరోజూ ఈ ఐదు పనులు చేస్తే తప్పక స్వర్గం ప్రాప్తిస్తుందట..

స్వర్గం-నరకం ఉన్నాయని హిందువులంతా నమ్ముతారు. అందరూ కూడా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటారు. అయితే స్వర్గ నరకాలను నిర్ణయించేది మనుషుల కర్మలే. ఇక స్వర్గానికి వెళ్లాలంటే ప్రతి రోజూ ఐదు పనులు చేయాలట. అవేంటో చూద్దాం.

1. భూత యజ్ఞం : తెలిసో తెలియకో మన కారణంగా మరణించే చిన్న ప్రాణుల విషయంలో ప్రాయశ్చిత్తంగా ఈ భూతయజ్ఞం చేయాలట. అంటే చీమలకు, పక్షులు వంటి వాటికి ఆహారాన్ని పెట్టి దాహార్తిని తీర్చాలి.

2. మనుష్య యజ్ఞం : మనుష్య యజ్ఞంలో కూడా రెండు రకాలు ఉన్నాయి. మన ఇంటికి వచ్చిన అతిథులను ఖాళీగా కాకుండా.. కడుపు నిండా అన్నం పెట్టడం ఒకటి.. అవసరంలో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం రెండవది. ఇవి రెండూ రోజూ చేయాలి.

3. పితృ యజ్ఞం : మనకు జన్మనిచ్చిన వారిని గౌరవించాలి. ప్రతిరోజూ వారితో కాస్త సమయం గడపాలి. వారు దూరంగా ఉన్నా ఫోన్ ద్వారా నిత్యం వారితో మాట్లాడుతూ ఉండాలి.

4. ఋషి యజ్ఞం : ఋుషులను గౌరవించాలి. ఋుషులు రచించిన కొన్ని వ్యాసాలు లేదా శ్లోకాలను నిత్యం పఠించాలి. గురుపూర్ణిమ వంటి పండగల రోజున వారిని పూజించాలి.

5. దైవ యజ్ఞం : ప్రతిరోజూ దైవయజ్ఞం చేయాలి. దీనిలో భాగంగా ప్రతిరోజూ ఓ 10 నిమిషాలపాటు హోమం చేయాలి. నిత్యం భగవంతుడిని పూజించుకోవాలి. మన చుట్టూ ఉన్నవారిలో భగవంతుడిని చూడాలి. ఇవి చేస్తే తప్పక స్వర్గానికి వెళతారట.

Share this post with your friends