అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం కొంటారు. ప్రస్తుతం బంగారం తులం ధర లక్ష రూపాయలకు చేరింది. మరి బంగారం కొనలేని వారు ఏం చేయాలి? బంగారం అంటేనే సంపద, శ్రేయస్సులకు చిహ్నం కదా. మరి అది కొనలేని వారు ఏం చేయాలి? అంటే బంగారం కొనలేకున్నా వేరే వస్తువులు కొనుగోలు చేసినా అంతకు మించిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అదేంటో తెలుసుకుందాం. ఈ రోజున కొత్త ఇల్లు, వాహనం, భూమిని కొనుగోలు చేయడం కూడా సర్వసాధారణం. ఈ కొనుగోళ్లు దీర్ఘకాలిక శ్రేయస్సు తెస్తాయని నమ్మకం.
ఈ రోజునే కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు వంటివి సత్ఫలితాన్నిస్తాయని భావిస్తారు. అవేంటో తెలుసుకుందాం. బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు దక్షిణావర్తి శంఖాన్ని దైవంగా పూజ గదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది. అలాగే ఈ రోజున ఒక శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా శివలింగాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు పాదరస శివలింగాన్ని తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. కొన్ని నియమ నిష్టలతో శివయ్యను పూజించడం వల్ల బంగారం కొనుగోలు చేసిన దాన్ని మించిన ఫలితం వస్తుందని చెబుతారు.