సమస్యలు వేధిస్తుంటే ఇంట్లో ఇవేమైనా ఉన్నాయేమో ఒక్కసారి చూడండి..

సమస్య లేని మనిషి కానీ.. ఇల్లు కానీ ఉండదు. సమస్యలు వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. విరామం తీసుకోవడానికి కూడా ఒక్కోసారి అవదు. అంతలా సమస్యలను మన జీవితాలను చుట్టుముట్టేస్తూ ఉంటాయి. మరి ఈ సమస్యల నుంచి బయటపడటమెలా? అంటే.. పరిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి. ముందుగా మన ఇంట్లో నుంచే వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇంట్లో వస్తువులు పెట్టే ప్లేస్‌ను బట్టి కూడా పరిస్తితులు మారిపోతుంటాయి. కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదు. అవేంటో చూద్దాం.

ముఖ్యంగా మన ఇంట ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ల మొక్కైనా కాక్టస్‌ను పెంచకూడదట. దీని వలన సమస్యలొచ్చే అవకాశం ఉందట. మన ఇంట్లో నటరాజ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదట. కళాకారులు తప్పకుండా నటరాజు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే నటరాజు కళకు మాత్రమే కాకుండా విధ్వంసానికి సైతం ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదట. ఇల్లు అందంగా కనిపించడం కోసం ఇంటి ముందు నీటి ఫౌంటెన్‌ను చాలా మంది పెడుతుంటారు. దీనిని సైతం ఇంట్లో ఉండకూడదట. ఇది పెడితే ఇంటికి వచ్చే సంతోషం, ఐశ్వర్యం వచ్చిన వెంటనే పోతుందట. ఇక అద్దం కానీ, గాజులు కానీ.. గాజు వస్తువులు ఏమైనా కానివ్వండి పగిలితే మాత్రం ఇంట్లో ఉంచకూడదట. ఇది దురదృష్టానికి సంకేతమట. అందుకే పగిలిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట ఉంచకూడదట.

Share this post with your friends