ఆ చిన్ని కృష్ణుడిని దర్శించుకుంటే ఎలాంటి రోగమైనా పరార్..

భారతదేశంలో ఆలయాలకు కొదువేమీ లేదు. ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. 5000 సంవత్సరాల క్రితం స్థాపించిన ఓ ఆలయం దేవుని సొంత దేశంగా పేర్కొనే కేరళ రాష్ట్రంలో ఉంది. అది చిన్ని కృష్ణుడి ఆలయం. కేరళలోని త్రిసూర్ ప్రాంతంలోని గురువాయూర్‌లో ఉంది. ఈ ఆలయ మహత్యం చాలా గొప్పది. ఇక్కడి ప్రజలంతా సాక్షాత్తు కృష్ణ భగవానుడే వచ్చి ఇక్కడ వెలిశాడని నమ్ముతారు. బ్రహ్మదేవుడు నుంచి తన అర్చా మూర్తిని స్వయంగా శ్రీకృష్ణుడు అందుకున్నాడట. దానిని తన స్నేహితుడైన ఉద్ధవుడికి అందజేశాడట. ఆ మూర్తిని ఉద్ధవుడు తీసుకెళుతుండగా.. ప్రళయం వచ్చి మూర్తి చేజారిందట. దానిని గురువు గ్రహించగా.. వాయువు ఈ క్షేత్రంలో ప్రతిష్టించాడట. కాబట్టి ఆ ప్రాంతం గురువాయూరుగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి స్వామివారిని గురువాయూరప్ప అని భక్తులు పిలుచుకుంటారు. ఇక్కడి చిన్ని కృష్ణుడు ఒక గొప్ప వైద్యుడు అని భక్తుల విశ్వాసం. ఈ స్వామిని మనసారా వేడుకుంటే చాలు దీర్ఘ వ్యాధులు నయమైపోతాయని భక్తుల నమ్మకం. స్వామివారి మూల మూర్తిని చూస్తూ తమ వ్యాధి గురించి చెబితే చాలట. వెంటనే విముక్తి కల్పిస్తాడట. మొండి వ్యాధులు సైతం ఇట్టే నయమవుతాయట. వివిధ రోగాలతో బాధపడేవారు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి దర్శనం కోసం వస్తుంటారు. చాలా మంది భక్తులకు తమ రోగాల నుంచి విముక్తి లభించిందట. ఈ కారణంగానే ఇక్కడి చిన్ని కృష్ణుడిని గొప్ప వైద్యుడని కూడా చెబుతుంటారు.

Share this post with your friends