ఎముకలు అరిగిపోయిన వారు ఈ లింగం దగ్గర ఇచ్చే విభూతిని ఔషధంగా తీసుకుంటే..

అరుణాచలం వెళ్లిన వారంతా గిరి ప్రదక్షిణ చేయకుండా తిరిగి రారు. ఇటీవలి కాలంలో అరుణాచలేశ్వరుడి మహత్స్యం తెలుసుకుని పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళుతున్నారు. అయితే కొత్తగా అరుణాచలం వెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచైతే మొదలు పెడతారో అక్కడికి తిరిగి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ముందుగా వినాయకుడికి నమస్కరించిన మీదటే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ అనేది కచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. ఎందుకంటే.. కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మరూపంలో యోగులు ‘ సిద్ధులు ‘ దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు.

అరుణాచలం వెళ్లే ప్రతి వారు కచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్ లు ఖచ్చితంగా ఇస్తారు. దర్శనానికి గిరిప్రదక్షిణకి వెళ్లేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు. ఎముకలు అరిగి పోయిన వారు యమ లింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘం అని చెబుతారు. నైఋతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు కచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది. ఏ మంత్రము లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు.

Share this post with your friends